ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామీణ మండలం కోతిగుట్ట శివారులో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. మండల పరిధిలోని కోతిగుట్ట గ్రామ శివారులో.. ఏనుగుల గుంపు నుంచి ఓ గజరాజు విడిపోగా.. పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆ ఏనుగు ఒంటిని రాసుకునేందుకు ప్రయత్నించింది.
పాపం ఏనుగు.. అలా దారి తప్పింది.. ఇలా మృత్యువాత పడింది! - ఏపీలో ఏనుగుల మృతుల
ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట శివారులో విద్యుదాఘాతంతో ఏనుగు మరణించింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఏనుగుపై విద్యుత్ తీగలు పడ్డాయి.
elephant died due to electric shock
ఈ క్రమంలో... ఏనుగు బలానికి విద్యుత్ స్తంభం విరిగిపోగా... కరెంటు తీగలన్నీ మీద పడ్డాయి. ఆ ఏనుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.