తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణకు కేంద్ర విద్యుత్​ శాఖ ఆదేశాలు - తెలంగాణ విద్యుత్​ సంస్థ

Electricity dues dispute between two states తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి బాకీ పడిన విద్యుత్​ బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్రం విద్యుత్​ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.

electricity dues
విద్యుత్​ బకాయిలు

By

Published : Aug 30, 2022, 12:46 PM IST

Electricity dues dispute between two states: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం బకాయిపడ్డ రూ.3,441 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ ను, రూ.3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీ చెల్లించాలని పేర్కొంది. ఆ బకాయిలను తెలంగాణ రాష్ట్రం 30రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

2014-17 వరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సంబంధించిన విద్యుత్ సరఫరా బకాయిలుగా కేంద్రం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ప్రిన్సిపల్ అమౌంట్ రూ.7,493 కోట్లు, వడ్డీ 10.50శాతంతో రూ.5,039 కోట్లు మొత్తం కలుపుకుని రూ.12,532 కోట్లు ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు బకాయి పడ్డట్లు ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ బకాయి ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ తెలంగాణ కంటే ఏపీ ప్రభుత్వం ఎక్కువ విద్యుత్ బకాయిలు ఉందన్నారు.

ఆ రకంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వమే తమకి చెల్లించాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం వాటికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందని అంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని సీఎండీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details