Electricity Bill : విద్యుత్తు బిల్లును పొందే విషయంలో వినియోగదారుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) వరంగల్ జిల్లాలో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఇప్పటివరకు సిబ్బంది ఇచ్చే బిల్లులు, వినియోగదారులే స్వయంగా తమ సెల్‌ఫోన్‌లలో తీసుకునే సెల్ఫ్ మీటర్ రీడింగ్ బిల్లులపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులు దాటాక రీడింగ్ తీసుకుంటే యూనిట్లు పెరిగి టారిఫ్‌లో తేడా వస్తున్నట్లు చెబుతుండగా సమస్యకు పరిష్కారంగా సరిగ్గా నెల బిల్లును పొందేలా సెల్ఫ్ మీటరింగ్ యాప్‌ను అప్‌డేట్ చేశారు.
Electricity Bill : ఒకటో తేదీనే నెల కరెంటు బిల్లు.. - కరెంట్ బిల్లు
Electricity Bill : ఇక నుంచి ప్రతి నెల ఒకటో తారీఖునే విద్యుత్ బిల్లు పొందే వెసులుబాటు ఉందని ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. విద్యుత్ బిల్లు విషయంలో వినియోగదారుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు వరంగల్ జిల్లాలో ఓ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఈ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ మండల డిస్కంలలో అమలు చేయనున్నారు.
వరంగల్ జిల్లాలోని సుమారు 3 లక్షల మీటర్ల వినియోగదారులు ఒకటి, రెండో తేదీల్లోనే సెల్ఫ్ మీటరింగ్ విధానంలో బిల్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ మండల డిస్కంలలో అమలు చేయనున్నారు. భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్, ఎన్పీడీసీఎల్ యాప్‌ల ద్వారా ఈ విధానంలో బిల్లు పొందొచ్చు.
ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లో తీసుకున్న వారికి మాత్రమే నెల రోజుల బిల్లు పొందే వెసులుబాటు కల్పించారు. తర్వాత తేదీల్లో తీసుకుంటే పాత విధానంలోనే ఉంటుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు త్వరలో ఆండ్రాయిడ్ విధానంలోనూ బిల్లులను అందిస్తామని సీఎండీ గోపాల్‌రావు తెలిపారు.