తెలంగాణ

telangana

ETV Bharat / city

చౌక ధరలో ప్రయాణం.. ఆశ్చర్యంగా ఉందా! మీరే చూడండి - చౌక ధరలో ప్రయాణం

ELECTRIC VEHICLES CHEAP COST TRAVELLING: ఇప్పుడున్న రోజుల్లో దూరప్రాంతాలకు వెళ్లాలంటే తడిచి మోపేడు అవుతుంది. పెట్రోల్​,డీజిల్​ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటువంటి సమయాల్లో ప్రయాణం చేయాలంటే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కేవలం రూ. 360 లతో ఏకంగా 240 కి.మీ దూరం వెళ్లవచ్చు అది ఎలా అనుకుంటున్నారా అయితే చూడండి మరీ..

ELECTRIC VEHICLES
ఎలక్ట్రానిక్​ వాహనాలు

By

Published : Sep 18, 2022, 7:20 AM IST

ELECTRIC VEHICLES CHEAP COST TRAVELLING: మీరు కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్నారా?.. కనీసం 20 లీటర్ల డీజిల్‌ పోయించుకోవాలి. విద్యుత్‌ కారు కొనండి.. కేవలం రూ.360తో విజయవాడకు చేరుకోండి. మార్గమధ్యలో ఎలాంటి అవాంతరాలుండవ్‌. హైదరాబాద్‌ నుంచి కర్నూలుకూ అంతే ఖర్చుతో వెళ్లొచ్చంటూ విద్యుత్తు కార్ల తయారీ సంస్థలు, డీలర్లు ప్రచారం చేస్తున్నారు. ఈ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ విధానాలతో వినియోగదారులు ఆకర్షితులవుతుండడంతో హైదరాబాద్‌లో నాలుగైదునెలల నుంచి ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మరోవైపు పలు శాఖల ఉన్నతాధికారులు విద్యుత్‌ వాహనాలను వినియోగించాలంటూ రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

30 యూనిట్లకు కనీసం 300 కి.మీ. విద్యుత్‌ కారు బ్యాటరీకి 30 యూనిట్ల ఛార్జింగ్‌ చేస్తే చాలు కనీసం 300 కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తుంది. ఇటీవల రెండు వేరియంట్లను విడుదల చేసిన టాటా కంపెనీ.. నెక్సాన్‌ మ్యాక్స్‌ 437 కిలోమీటర్లు, నెక్సాన్‌ ప్రైమ్‌ 312 కిలోమీటర్లు వెళ్లొచ్చని ప్రకటించింది. బ్యాటరీ ఛార్జింగ్‌కు 18 నిమిషాలు పడుతుంది.. యూనిట్‌ రూ.12 చొప్పున 30 యూనిట్లకు రూ.360 అవుతుంది. ప్రాథమిక మోడల్‌ కారును 30 యూనిట్లు ఛార్జింగ్‌ చేస్తే 300 కి.మీ., హైఎండ్‌ అయితే 30 యూనిట్ల ఛార్జింగ్‌కు 450 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రూ.3 లక్షలతో బ్యాటరీ యూనిట్‌ను కొనుగోలు చేస్తే ఇంట్లోనే ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. పెట్రోల్‌, డీజిల్‌ కార్లకంటే ఈ కార్లు రూ.3 లక్షల-రూ.5 లక్షలు అధికం. పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు కిలోమీటర్‌ రూ.8 ఖర్చయితే విద్యుత్‌ వాహనానికి కిలోమీటర్‌కు రూ.1.50-రూ.2 మాత్రమే ఖర్చవుతుందట.

ఛార్జింగ్‌ స్టేషన్లకు ప్రత్యేకయాప్‌.. కొత్త కేంద్రాలు

హైదరాబాద్‌ కేంద్రంగా మారుతి సుజుకీ, టాటాల విద్యుత్‌ కార్లను విక్రయిస్తున్న డీలర్లు విజయవాడ, కర్నూలు, గుంటూరుకు వెళ్లే వారి కోసం జాతీయ రహదారుల వెంట దాబాల వద్ద ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్ల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల డీలర్లే ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రత్యేక యాప్‌ ద్వారా గుర్తించొచ్చు. మరోవైపు తెలంగాణ సర్కారు తరఫున ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న టీఎస్‌ రెడ్కో.. గ్రేటర్‌లో 300 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం 40 ప్రాంతాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలుండగా ఈ ఏడాది చివరికి మరో 30 అందుబాటులోకి తీసుకురానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details