తెలంగాణ

telangana

ETV Bharat / city

Electric Vehicles: ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల కొనుగోలుకే ఆసక్తి - తెలంగాణ వార్తలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న వేళ.. ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల కొనుగోలువైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పలు ప్రోత్సాహకాలనూ అందిస్తోంది. ఇప్పటికే సుమారు 20కోట్ల రూపాయల వరకు వినియోగదారులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్‌ వాహనాలు మరింత పెరగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Electric Vehicles
Electric Vehicles

By

Published : Sep 7, 2021, 5:14 AM IST

ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉండడంతో అనేకమంది అటువైపు మొగ్గుచూపుతున్నారు. భారీగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల ప్రభావమూ కొనుగోళ్లపై పడుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,568 ఈవీ వాహనాలను కొనుగోలు చేశారు. వాహనదారులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు తదితరాలు కలిపి 19కోట్ల 93లక్షల 78వేలు మినహాయింపులు ఇచ్చినట్లు రవాణాశాఖ వెల్లడించింది.

రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్​ మాఫీ..

ఈ -వాహనాలు కొనుగోలుదారులకు సంబంధించిన మినహాయింపులను ప్రభుత్వం వెల్లడించింది. మొదటి 2,00,000 ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్​ను మాఫీ చేస్తుంది. వాహన ఇన్వాయిస్ ధరపై 9శాతం పన్నును మాఫీ చేస్తారు. అందులో భాగంగా రూ.300ల రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రూ.6,030 నుంచి రూ.9,810 వరకు మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదటి 20,000ల ఆటోలకు రూ.1,000ల రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు. మొదటి 5,000ల రెట్రో ఫిట్ మెంట్ ఆటోలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్​ను మినహాయిస్తారు. రిట్రో ఫిట్​మెంట్ ధరపై 15శాతం లేదా, రూ.15,000 రాయితీ కల్పించనున్నారు.

ఇన్వాయిస్ ధరపై 12శాతం రాయితీ..

మొదటి 5,000ల మోటార్ క్యాబ్​లకు రూ.1,000ల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.10లక్షల కంటే ఎక్కువ ధర వాహనాలకు ఇన్వాయిస్ ధరపై 12శాతం రాయితీ కల్పిస్తారు. రూ.10లక్షల కంటే తక్కువ ధర గల వాహనాలకు 12శాతం ట్యాక్స్​ను మినహాయిస్తారు. మొదటి 10,000ల రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000తో పాటు, ఒక క్వార్టర్లీ ట్యాక్స్​ను మినహాయిస్తారు. మొదటి 5,000ల ప్రైవేట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.600లతో పాటు, రూ.10లక్షల కన్న ఎక్కువ ఉన్న వాహనాలకు ఇన్వాయిస్ ధరపై 14శాతం రాయితీని అందజేస్తారు. రూ.10లక్షల కన్న తక్కువ ఉన్న వాహనాలకు 12శాతం రాయితీని కల్పిస్తారు. మొదటి 500ల ఎలక్ట్రిక్ బస్సులకు రూ.1,500ల రిజిస్ట్రేషన్ ఫీజు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సీటుకు రూ.2,625 గల క్వార్టర్ ఫీజును, దేశవ్యాప్తంగా ఒక్కో సీటుకు రూ.3,675లు క్వార్టర్ ఫీజును మాఫీ చేస్తారు.

ఛార్జింగ్ కేంద్రాల కోసం విజ్ఞప్తి..

ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపులు ఇవ్వడంతో పాటు.. ఛార్జింగ్ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ఈవీ వాహన ఉత్పత్తిదారులు కూడా వాటిని ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. పెట్రోల్ వాహనాలతో పోల్చితే వాహనాల సర్వీస్ బాగానే ఉంటుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. నిర్వహణ ఖర్చు తక్కువ ఉండడంతో పాటు.. వాతావరణం కాలుష్యం బారిన పడకుండా ఈ-వాహనాలు కాపాడుతాయంటున్నారు.

ఇవీ చూడండి:JIVIKA AAYUR SCIENCES: హైదరాబాద్​లో త్వరలో జీవికా ప్లాంట్​.. వెయ్యి మందికి ఉద్యోగాలు

ABOUT THE AUTHOR

...view details