తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిపివేత - AP local body elections 2020 postpone latest news

ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కేంద్రం కరోనాని జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో ఎన్నికలను వాయిదా వేసింది.

ap elections latest news
ap elections latest news

By

Published : Mar 15, 2020, 12:23 PM IST

‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పేపర్‌ బ్యాలెట్‌ వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది'

- రమేశ్ కుమార్, ఏపీ ఎన్నికల కమిషనర్

కోడ్‌ కొనసాగుతుంది..

ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ ఏపీలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు.

పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం

స్థానిక ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమని ఎన్నికల కమిషనర్ రమేశ్ కమార్ అన్నారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు.

‘స్థానిక ఎన్నికల ప్రక్రియలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో జరిగిన పరిణామాలు బాధాకరం. బెదిరింపులు, అడ్డుకున్న దృశ్యాలు మాధ్యమాల్లో వచ్చాయి. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నాం. అధికార యంత్రాంగం పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. మాచర్ల దాడిలో పాల్గొన్న నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉంది’-రమేశ్ కుమార్ ఏపీ ఎన్నికల కమిషనర్​

ఏపీలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత

ఇదీ చదవండి : గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు

ABOUT THE AUTHOR

...view details