EC notice to Raja Singh: సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి న్యూస్‌లో నిలిచారు. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్‌కు మద్దతుగా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఓటర్లను బెదిరించినట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆ వీడియో ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని పేర్కొన్న ఈసీ.. రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
యూపీలో ఉండాలంటే.. యోగిని గెలిపించాల్సిందే..
Raja Singh Controversy on UP Elections : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ ఓ వీడియో చేశారు. భాజపా శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి.. యోగి సర్కార్ రావాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగని రాజాసింగ్.. ఓటు వేయని వాళ్ల జాబితా తీసి వాళ్ల ఇళ్ల పైకి బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం..Raja Singh Controversy: 'యూపీలో భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు'
ఇదీ చూడండి: