ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటన - telangana latest news
16:40 August 12
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటన
అక్టోబర్ నెలాఖరు వరకు ప్రీరివిజన్ కార్యక్రమాలు చేపడతారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు, మార్పులు, చేర్పులు ఇందులో ఉంటాయి. నవంబర్ 16వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు.
ఆరోజు నుంచి డిసెంబర్ 12 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు గడువు ఉంటుంది. ఇందుకోసం పోలింగ్ బూత్ల వద్ద.. అధికారులు, సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండేలా నెలలో రెండు శని, ఆదివారాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు. 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. 2021 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసున్నవారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. www.nvsp.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఇవీచూడండి: శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి ఆగ్రహం