తెలంగాణ

telangana

ETV Bharat / city

'లెక్క'లేకుంటే... పదవి గోవిందా

ఎన్నికల వ్యయ లెక్కలు చూపని వారిపై ఎన్నికల సంఘం కొరడా ఝలిపిస్తోంది. ఇప్పటికే కొందరిని అనర్హులుగా ప్రకటించింది. 2019లో నిర్వహించిన  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి..వ్యయ వివరాలివ్వని వేలమంది అభ్యర్థుల చిట్టాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. వారికి నోటీసులిచ్చింది.

By

Published : May 12, 2020, 6:23 AM IST

Updated : May 12, 2020, 6:54 AM IST

election commission gave notice to politicians
‘లెక్క’లేకుంటే... పదవి గోవిందా

ఎన్నికల వ్యయ లెక్కలు చూపని వారిపై ఎన్నికల సంఘం కన్నెర్ర చెస్తోంది. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో నెగ్గిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించింది. ముందుగా పెద్దపల్లి జిల్లాలోని 57 మంది వార్డు సభ్యులతో పాటు ముగ్గురు ఉపసర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై అనర్హత వేటు వేసింది.

ఈ వివరాలను ఎన్నికల కమిషన్‌ పంచాయతీరాజ్‌శాఖకు తెలియజేసింది. వీరు పదవులు కోల్పోవడంతో ఆయా వార్డులు ఖాళీ అయినట్లు జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. ఈ స్థానాల్లో ఏడాదిలోగా ఎన్నికలు నిర్వహించనున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

45 రోజుల్లో వ్యయ వివరాలివ్వాలి

సాధారణంగా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలి. గడువులోపు ఇవ్వకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది. జిల్లా నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలందిన వెంటనే పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసు ఇస్తుంది.

వ్యయ వివరాలు ఎందుకివ్వలేదో కారణాలతో అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాధానమివ్వాలి. సమాధానం ఇవ్వకపోయినా, సహేతుకమైన కారణాలు లేకున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం వారిని అనర్హులుగా ప్రకటిస్తుంది. గెలిచినవారు ఈ జాబితాలో ఉంటే పదవులు కోల్పోతారు. ఓడిన అభ్యర్థులు నిర్దేశించిన గడువు వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు.

Last Updated : May 12, 2020, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details