జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుంది. మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంటుంది. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌తో పాటు మరో 11 డివిజన్లలో 3 రౌండ్లలో లెక్కింపు జరగనుంది.
మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తైతే.. సాయంత్రానికి ఫలితాలు! - గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంటుంది.
అయితే రాంనగర్ డివిజన్ స్ట్రాంగ్ రూమ్, పురానా పూల్, నిజాం కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఇంకా తెరుచుకోలేదు. ఫలితంగా దోమలగూడ ఏవీ కళాశాలలో రాంనగర్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఘాన్సీబజార్, పురానాపూల్‌లో రీపోలింగ్ కోసం భాజపా హైకోర్టును ఆశ్రయించగా.. ఓట్ల లెక్కింపునకు ముందే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ రెండు చోట్ల రీపోలింగ్ అవసరం లేదని ఈసీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే కౌంటింగ్ కొంత ఆలస్యమైంది.
ఇవీ చూడండి: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు