CEO Shashank Goyal: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. శశాంక్ గోయల్ డిప్యుటేషన్‌పై కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ గత నెల 18న నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయినా అప్పటి నుంచి ఆయన సీఈఓ విధుల నుంచి రిలీవ్ కాలేదు. తాజాగా గోయల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేందుకు అనుమతించిన ఈసీ... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది.
CEO Shashank Goyal: సీఈవో శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేసేందుకు ఈసీ అనుమతి - తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
CEO Shashank Goyal: గోయల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేందుకు ఈసీ అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఇన్‌ఛార్జి సీఈఓగా నియమించింది.
Shashank Goyal
శశాంక్ గోయల్ రిలీవ్ నేపథ్యంలో అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఇన్‌ఛార్జి సీఈఓగా నియమించింది. శశాంక్ గోయల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేశాక జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. అటు కొత్త సీఈఓ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది.
ఇదీచూడండి:Shashank Goyal transferred: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ