తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మరణాలు - ap corona latest cases

ap corona news
ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మరణాలు

By

Published : Aug 11, 2020, 6:07 PM IST

Updated : Aug 11, 2020, 7:29 PM IST

18:05 August 11

ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మరణాలు

ఏపీలో 24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. 24 గంటల వ్యవధిలో 87 మంది కొవిడ్​తో మృతిచెందారు. కరోనా మృతులు 2,203కు చేరాయి. ఏపీలో కరోనా నుంచి 1,54,749 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 87,597 కొవిడ్​ యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 58,315 మందికి కరోనా పరీక్షలు చేశారు.  ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటివరకు 25.92 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా మృతులు...

అనంతపురం-13, చిత్తూరు-12, గుంటూరు-9, ప్రకాశం-7, విశాఖ-7, కడప-6, శ్రీకాకుళం-6, పశ్చిమగోదావరి-6, తూర్పుగోదావరి-5, నెల్లూరు-5, విజయనగరం-5, కృష్ణా-3, కర్నూలు-3.

జిల్లాల వారీగా కొత్త కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1372 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1138, అనంతపురం జిల్లాలో 959, చిత్తూరు జిల్లాలో 758, గుంటూరు జిల్లాలో 717, పశ్చిమగోదావరి జిల్లాలో 678, విశాఖ జిల్లాలో 676, విజయనగరం జిల్లాలో 594, కడప జిల్లాలో 579, శ్రీకాకుళం జిల్లాలో 504, నెల్లూరు జిల్లాలో 364, ప్రకాశం జిల్లాలో 343, కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీచూడండి:70 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు

Last Updated : Aug 11, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details