తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,842 కరోనా కేసులు

corona news telangana
రాష్ట్రంలో కొత్తగా 1,842 కరోనా కేసులు

By

Published : Aug 24, 2020, 9:02 AM IST

Updated : Aug 24, 2020, 10:14 AM IST

08:59 August 24

రాష్ట్రంలో కొత్తగా 1,842 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,842 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,06,091కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 373 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. తాజాగా కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 761 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని మరో 1,825 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 82,411 మంది బాధితులు కోలుకున్నారు.  రాష్ట్రంలో మొత్తం 22,919 కరోనా యాక్టివ్‌ కేసులు  

జిల్లాల వారీగా.. 

నిజామాబాద్‌లో 158, కరీంనగర్‌లో 134, సూర్యాపేటలో 113 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 109, సిద్దిపేటలో 86, ఖమ్మంలో 77 మందికి కరోనా సోకింది. వరంగల్‌లో 74, జగిత్యాలలో 70, మహబూబాబాద్‌లో 64 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మంచిర్యాలలో 59, సంగారెడ్డిలో 50, వనపర్తిలో 50.. కరోనా కేసులు బయటపడ్డాయి. నల్గొండలో 47, పెద్దపల్లిలో 44, మహబూబ్‌నగర్‌లో 42, భద్రాద్రి కొత్తగూడెంలో 37, జోగులాంబ గద్వాలలో 33, నాగర్‌కర్నూల్‌లో 32, మేడ్చల్‌లో 32, ఆదిలాబాద్‌లో 23 మందికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది.  

జనగామలో 24, కామారెడ్డిలో 20, సిరిసిల్లలో 13, మెదక్‌లో 13, భువనగిరిలో 14, ములుగులో 12, వికారాబాద్‌లో 11, నిర్మల్‌లో 10, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 8, ఆసిఫాబాద్‌లో 5, నారాయణపేటలో 4, భూపాలపల్లిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. 

ఇవీచూడండి:దేశంలో కొత్తగా 61,408 కేసులు.. 836 మరణాలు

Last Updated : Aug 24, 2020, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details