ఆరోగ్య సూచీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దిల్లీలోని పృథ్వీభవన్లో జరిగిన 13వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ సదస్సులో పాల్గొన్నారు. వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు చేసినట్లు ఈటల తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులు, ప్రముఖ వైద్యులు హాజరయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా సమావేశం సాగిందని మంత్రి ఈటల వెల్లడించారు. పురోగమిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తే అవి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రజారోగ్యంలో తెలంగాణలోనే మంచి పథకాలు అమలు అవుతున్నాయని.. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ ద్వారానే రాష్ట్రంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. వైద్య కళాశాలల్లోని పడకలను ప్రభుత్వాస్పత్రులకు అనుసంధానం చేస్తే ఎక్కువ మంది పేదలకు ఉపయోగం ఉంటుందని కేంద్రానికి సూచించినట్లు ఈటల తెలిపారు.
'ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తా' - delhi
దిల్లీలోని పృథ్వీభవన్లో జరిగిన 13వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ సదస్సులో మంత్రి ఈటల పాల్గొన్నారు. ప్రజారోగ్యంలో తెలంగాణలోనే మంచి పథకాలు అమలవుతున్నాయని... ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తామని వెల్లడించారు.
'ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తా'