కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయని... ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ప్రజలు అప్పుల పాలు కావొద్దని... ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్, కాలనీ అసోసియేన్లతో మంత్రి సమావేశమయ్యారు. కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. కరోనా సోకిన వారిని వెలివేసినట్లు చూస్తే మంచిది కాదని సూచించారు. కరోనాపై పోరులో రెసిడెన్షియల్ సంఘాలన్నీ కలిసి రావాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఉండేందుకు కమ్యూనిటీ హాళ్లు, క్లబ్ హౌజ్‌లను ఇస్తే.. ప్రభుత్వం మందులు, భోజనం అందిస్తోందని సంఘాలకు సూచించారు.
కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి: ఈటల
హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్, కాలనీ అసోసియేన్లతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి కోరారు.
కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి: ఈటల
రూ.లక్ష అయ్యే కరోనా చికిత్సకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రూ.30 లక్షల వరకు వసూలు చేయడం సబబు కాదని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాపార ధోరణి మంచిది కాదని ఈటల సూచించారు. కరోనాను వీలైనంత ముందుగా గుర్తిస్తే.. ప్రాణాలను కాపాడవచ్చన్న ఉద్దేశంతో పరీక్షలు పెంచామని చెప్పారు. కొవిడ్ పరీక్షలు, చికిత్సల వివరాలు తెలిపేందుకు తర్వలోనే నోడల్ అధికారిని ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ