తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈనాడు కథల పోటీకి ఆహ్వానం - ఈనాడు కథల పోటీలు న్యూస్

తెలుగు వెలుగు, బాల భారతం, విపుల, చతుర మాసపత్రికల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి పట్టం కడుతున్న ఈనాడు, రామోజీ ఫౌండేషన్‌ సంస్థలు రచయితల్ని ప్రోత్సహించేందుకు 'కథా విజయం' పేరుతో కథల పోటీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పోటీలకు రచనలను ఆహ్వానిస్తోంది.

telugu velugu
ఈనాడు కథల పోటీకి ఆహ్వానం

By

Published : Oct 1, 2020, 12:59 AM IST

గతేడాది పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. నాలుగు విదేశాలు, 12 తెలుగేతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల కథలు వచ్చాయి. 18 నుంచి 90 ఏళ్ల వరకూ అన్ని వయోవర్గాల వారూ కథలను పంపారు. సుప్రసిద్ధ రచయితలు, సాహితీ విమర్శకులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం అంతిమ విజేతలను ఎంపిక చేసింది.

ఈ పోటీలో బహుమతులు పొందిన కథలు ‘ఈనాడు ఆదివారం’, ‘తెలుగు వెలుగు’, ‘విపుల’, ‘చతుర’ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ ఒరవడిని కొనసాగిస్తూ రామోజీ ఫౌండేషన్‌ 'కథా విజయం-2020' పోటీకి రచనలను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో 31 మంది విజేతలకు రూ.1 లక్షా 70 వేల బహుమతులు అందుతాయి. వివరాలు, పోటీ నిబంధనలను teluguvelugu.inలో చూడవచ్చు.

ABOUT THE AUTHOR

...view details