తెలంగాణ

telangana

ETV Bharat / city

రసవత్తరంగా ఈనాడు క్రికెట్ పోటీలు - EENADU CRICKET games in Hyderabad

మేడ్చల్​ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సీనియర్, జూనియర్, మహిళ విభాగాలు విడివిడిగా తలపడ్డాయి.

EENADU CRICKET games held at Mallareddy Engineering college in Hyderabad
రసవత్తరంగా ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Jan 23, 2020, 7:50 PM IST

ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సీనియర్ విభాగంలో రెండు మ్యాచ్​లు జరిగాయి. తెలంగాణ టైగర్స్, సెంట్రల్ ఆంధ్ర తలపడగా సెంట్రల్ ఆంధ్ర జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్​లో హైదరాబాద్ హీరోస్.. రాయలసీమ రాకర్స్​ను ఓడించింది.

జూనియర్ విభాగంలో రెండు మ్యాచ్​లు జరిగాయి. మొదటి మ్యాచ్​లో తెలంగాణ టైగర్స్, సెంట్రల్ ఆంధ్ర టీమ్​లు తలపడగా సెంట్రల్ ఆంధ్ర టీం విజయం సాధించింది. మరో మ్యాచులో రాయలసీమ రాకర్స్​పై... హైదరాబాద్ హీరోస్​ జయకేతనం ఎగరవేసింది. ఇక మహిళల విభాగంలో హైదరాబాద్ హీరోస్, రాయలసీమ రాకర్స్ జట్లు విజయం సాధించాయి.

రసవత్తరంగా ఈనాడు క్రికెట్ పోటీలు

ఇవీ చూడండి: ప్లాస్టిక్​ నుంచి పేపర్ సంచికి మారుదాం...

ABOUT THE AUTHOR

...view details