Facilities Telangana Govt Schools : మన ఊరు - మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల సహా ఇతర అంశాలపై రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో భేటీ అయింది. సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
'విద్యార్థులకు ఏ లోటు రావొద్దు'.. సర్కార్ బడుల్లో వసతులపై మంత్రుల భేటీ - మన ఊరు -మన బడి కార్యక్రమం
Telangana Govt Schools : మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కార్ బడుల్లో మౌలిక వసతులు, మెరుగైన సదుపాయాలు కల్పించే అంశంపై రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలను పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Telangana Govt Schools
పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సమీక్షించడంతో పాటు పాఠశాలల ప్రారంభం వరకు పూర్తి చేయాల్సిన సమస్యలపై మంత్రులు మాట్లాడుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ సహా ఇతర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచనలు చేస్తున్నారు.
ఇవీ చదవండి :