వచ్చే నెల 16న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పునః ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పునరుద్ఘాటించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు తెరుస్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను విద్యార్థుల ఇంటికి పంపి సన్నద్ధతకు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి వివరించారు. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100 శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు.
Minister Suresh: 'వచ్చే నెల 16న పాఠశాలలు పున:ప్రారంభం'
వచ్చే నెల 16 నుంచి ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100 శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నాడు-నేడు పనులు 98 శాతం పూర్తయ్యాయని.. ఆగస్టు 16న సీఎం జగన్ వీటిని ప్రజలకు అంకితం చేస్తారని మంత్రి పేర్కొన్నారు. అదే రోజు నాడు-నేడు రెండోదశ కింద రూ.4వేల కోట్లతో 16 వేల స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. అమ్మ ఒడి వద్దన్న 9 లక్షల మంది, డిగ్రీ కాలేజీల్లో వసతి దీవెన వద్దనుకుంటున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ల్యాప్ట్యాప్లు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:KTR: 'సోలార్ విద్యుదుత్పత్తిలో.. దేశంలోనే తెలంగాణ రెండోస్థానం'