రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిది ఆపై తరగతులకు బోధన ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మిగితా తరగతుల బోధనను తర్వాత మొదలుపెడతామని వెల్లడించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ఉంటుందని తెలిపారు.
'కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన' - తెలంగాణ వార్తలు
ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిది ఆపై తరగతులకు బోధన ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ఉంటుందని తెలిపారు.
కరోనా సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తొమ్మిదో తరగతి వరకు ఉన్న వారిని.. పై తరగతులకు ప్రమోట్ చేశాం. పదో తరగతి నుంచి పోటీ పరీక్షలుంటాయి కాబట్టి వారిని అలా ప్రమోట్ చేయడం కుదరదు. కొవిడ్ నియమాలు పాటిస్తూ రాష్ట్రంలో ఐసెట్, ఎంసెట్‌తో పాటు అనేక పరీక్షలు నిర్వహించాం. ప్రత్యక్ష బోధన వీలుకాని తరణంలో ఆన్లైన్ క్లాసులను దూరదర్శన్ను వినియోగించుకుని నిర్వహించాం. ఇక ఇప్పటి నుంచి తొమ్మిదో తరగతి, ఆపై తరగతుల విద్యార్ధులకు ప్రత్యక్ష బోధనను ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. కొవిడ్ నియమాలను పాటిస్తూ అందరం ముందకు పోవాలని కోరుకుంటున్నా- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి.
ఇవీ చూడండి:'అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి చెల్లించేలా ఆదేశాలు'