పాఠశాలలను కొన్నాళ్ల తర్వాత ప్రారంభించినా రోజు విడిచి రోజు నడపాలని 45 శాతం మంది తల్లిదండ్రులు చెప్పగా, ప్రతిరోజు నడపాలని 24 శాతం మంది, షిప్టు పద్ధతిలో నిర్వహించాలని మిగిలినవారు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైన విషయాలివి. మరోవైపు అన్‌లాక్ -3లో భాగంగా ఆగస్టు 31 వరకు పాఠశాలలు మూసి ఉంటాయని కేంద్రం సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎలా స్పందించారంటే..
హైదరాబాద్ జిల్లాలో 60 శాతం మంది తల్లిదండ్రులు వ్యాక్సిన్ వచ్చాక తమ పిల్లలను పాఠశాలలకు పంపుతామని చెప్పగా 30 శాతం మంది దసరా తర్వాత అని చెప్పారు. మరో 10 శాతం మంది ఆగస్టు, సెప్టెంబరు మధ్య ఎప్పుడైనా ఫర్వాలేదన్నారు. మేడ్చల్ జిల్లాలో 71 శాతం మంది వ్యాక్సిన్ వచ్చాకే అంటూ స్పష్టంచేశారు. 14 శాతం మంది సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల్లో పంపిస్తామన్నారు.