తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇష్టారాజ్యంగా ఫీజులు.. స్పందించని విద్యాశాఖ! - ఇష్టారాజ్యంగా ఫీజులు.. స్పందించని విద్యాశాఖ!

ప్రైవేటు బడులు అడ్డగోలుగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫీజుల నియంత్రణకు వేసిన కమిటీ నివేదిక ఇచ్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Education Department Negligence On Private School Fee Polocy
ఇష్టారాజ్యంగా ఫీజులు.. స్పందించని విద్యాశాఖ!

By

Published : Feb 28, 2020, 10:01 AM IST

ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న ఫీజులను అదుపు చేసే దిశగా విద్యాశాఖ చొరవ తీసుకోవడంలో విఫలమయింది. ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు ఛైర్మన్​గా నియమించిన కమిటీ ఈ అంశం మీద నివేదిక సమర్పించి రెంటేళ్లు గడిచినా.. చర్యలు మాత్రం శూన్యం. ఇంజినీరింగ్, వైద్యవిద్య, ఇతర వృత్తికోర్సులకు ఎంత ఫీజులు చెల్లించాలో.. ప్రవేశం, ఇతర రుసుములను నియంత్రించడానికి ఒక కమిటీ ఉంది. అయితే.. ప్రైవేటు బడులలో మాత్రం ఫీజులను నియంత్రించే వ్యవస్థ లేదు. ఎంత ఫీజు చెల్లించాలో.. మార్గదర్శకాలు లేవు. దీంతో.. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

విద్యాశాఖ ఈ విషయమై గతంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేశాయి. దీంతో విద్యాశాఖ ఊరుకుంది. ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఒత్తిడితో ఆచార్య తిరుపతిరావు కమీటి వేశారు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. కమిటీ నివేదిక అందజేసిన మూడు నెలల తర్వాత ప్రైవేటు పాఠశాలలు ఫీజులను 10 శాతం పెంచుకోవచ్చంటూ చేసిన సిఫారసును అప్పటి విద్యాశాఖ ఉన్నతాదికారి రంజీవ్ ఆచార్య లేవనెత్తారు. వినియోగదారుల ధరల సూచిక, ద్రవ్యోల్బణం ఆధారంగా ఏటా 10శాతం పెంచుకోవచ్చని కమిటీ వివరణ ఇచ్చింది. అయితే.. ప్రతీ పాఠశాల ఆ ఏడాది ఎంత ఫీజు వసూలు చేసింది.. ఆ డబ్బులను దేనికి ఖర్చు చేసిందనే.. వివరాలు ఛార్టర్డ్ అకౌంటెంట్​తో ధృవీకరించి ప్రతీ ఏటా విద్యాశాఖకు సమర్పించాలి. అలా జరగని పక్షంలో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణ జరిపించాలని కమిటీ నివేదిక ఇచ్చింది.

కమిటీకి ముందు.. తర్వాత ఏం జరిగిందంటే?

  • 2016 సెప్టెంబరు 20 - 2009లో జారీ చేసిన జీవో 91ను సవరించుకొని రుసుములను నిర్ణయించవచ్చని తీర్పు ఇచ్చింది.
  • 2016 డిసెంబరు - రుసుముల నియంత్రణపై ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి పంపిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌.
  • 2017 మార్చి 21 - రుసుముల నియంత్రణకు మార్గదర్శకాల రూపకల్పన కోసం ఆచార్య తిరుపతిరావు ఛైర్మన్‌గా కమిటీ నియామకం.
  • 2017 డిసెంబరు 30 - రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తిరుపతిరావు కమిటీ.
  • 2018 జనవరి 11 - 2018-19 విద్యా సంవత్సరానికి 2017-18 ఫీజులే వసూలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల జారీ (దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది)
  • 2018 మార్చి 19 - తిరుపతిరావు కమిటీ గడువును మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వుల జారీ (జూన్‌ 18వ తేదీ లోపు నివేదిక సమర్పించాలి)..
  • 2018 జూన్‌ 30 - ప్రభుత్వం అడిగిన సందేహాలపై వివరణ ఇచ్చిన కమిటీ.

ABOUT THE AUTHOR

...view details