తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈడీ కస్టడీకి అగ్రిగోల్డ్ నిందితులు - agrigold latest news

ఈడీ కస్టడీకి అగ్రిగోల్డ్ నిందితులు
ఈడీ కస్టడీకి అగ్రిగోల్డ్ నిందితులు

By

Published : Dec 24, 2020, 3:41 PM IST

Updated : Dec 24, 2020, 4:34 PM IST

15:39 December 24

ఈడీ కస్టడీకి అగ్రిగోల్డ్ నిందితులు

అగ్రిగోల్డ్ నిందితులను 10 రోజుల ఈడీ కస్టడీకి  కోర్టు అనుమతించింది. ఈ నెల 27 నుంచి జనవరి 5వరకు  అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, ప్రమోటర్లు శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ప్రస్తుతం చంచల్​గూడా జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు  ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  

నమోదైన కేసుల ఆధారంగా..

మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్ 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసం చేసిందని పేర్కొన్న ఈడీ.. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు గుర్తించింది. గత సోదాల్లో రూ.22 లక్షల నగదుతో పాటు పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. వీటన్నింటిని గురించి ముగ్గురు నిందితులను ఈ నెల 27 నుంచి ఈడీ ప్రశ్నించనుంది.

సంబంధిత కథనం: కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము..!

Last Updated : Dec 24, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details