DRUGS CASE: ముమైత్‌ఖాన్‌ను 6 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు - ఈడీ వార్తలు
17:18 September 15
DRUGS CASE: ముమైత్‌ఖాన్‌ను 6 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు
టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. సినీనటీ ముమైత్‌ఖాన్‌ను ఈడీ అధికారులు 6 గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ముమైత్ సమాధానమిచ్చారు. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీతో కలిసి ముమైత్ ఖాన్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ఈడీ అధికారులు ఇప్పటికే సినీ రంగానికి చెందిన 9 మందిని ప్రశ్నించారు. పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రాణా, రవితేజ, నవదీప్తో పాటు డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్ సింగ్ను ప్రశ్నించారు. మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, జీషాన్ ను కూడా అధికారులు ప్రశ్నించి వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. కెల్విన్, జీషాన్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈనెల 17వ తేదీన ఈడీ అధికారుల ముందు తనీష్, 22వ తేదీన తరుణ్ హాజరు కావాల్సి ఉంది.
ఇదీ చదవండి:సోనూసూద్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు