BANK FRAUDS: బ్యాంకులను రుణాల పేరిట మోసం చేశారన్న అభియోగంపై జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, దాసి అనుబంధ సంస్థల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆదిలాబాద్లో 63 కోట్ల రూపాయల విలువైన 2,050 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. రుణాల పేరిట ఎస్బీఐ, యూకో బ్యాంకులను 306 కోట్ల రూపాయల మేర జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్ మోసం చేసిందని గతంలో సీబీఐ బెంగళూరు విభాగం కేసు నమోదు చేసింది.
జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, అనుబంధ సంస్థల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ - ఈడీ తాజా సమాచారం
BANK FRAUDS: రుణాల పేరిట బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. తాజాగా మరో 63 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
మనీలాండరింగ్ అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో కొన్ని ఆస్తులు అటాచ్ చేసి అభియోగపత్రం సమర్పించింది. తాజాగా మరో 63 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది.
ఇదీ చదవండి:అప్పు చెల్లించినా బ్లాక్‌మెయిల్.. ఫొటో మార్ఫ్ చేస్తామంటూ బెదిరింపులు