తెలంగాణ

telangana

ETV Bharat / city

అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్​.. చంచల్​గూడకు నిందితులు - తెలంగాణ వార్తలు

ed special court give remand to agrigold premotes from 14 day
అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్​.. చంచల్​గూడ జైలుకు నిందితులు

By

Published : Dec 23, 2020, 12:20 PM IST

Updated : Dec 23, 2020, 2:05 PM IST

12:18 December 23

అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్​.. చంచల్​గూడకు నిందితులు

అగ్రిగోల్డ్ ప్రమోటర్లను ఈడీ అధికారులు నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.  ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావుతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్ల శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ప్రమోటర్లకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురి కస్టడీ కోసం ఈడీ పిటిషన్ దాఖలు చేయనుంది.  

మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్ 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసం చేసిందని పేర్కొన్న ఈడీ.. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు గుర్తించింది. గత సోదాల్లో రూ.22 లక్షల నగదుతో పాటు పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. 

సంబంధిత కథనం:అగ్రిగోల్డ్ ఛైర్మన్​ సహా ముగ్గురు అరెస్ట్​

Last Updated : Dec 23, 2020, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details