Agrigold case: అగ్రిగోల్డ్ కేసులో రూ.32.37 కోట్ల ఆస్తులు అటాచ్
16:26 November 30
అగ్రిగోల్డ్ కేసులో రూ.32.37 కోట్ల ఆస్తులు అటాచ్
Agrigold case: అగ్రిగోల్డ్ కుంభకోణంలో మరో 32 కోట్ల 37 లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 52 స్థిరాస్తులను తాజాగా ఈడీ అటాచ్ చేసింది.
గతంలో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 4,109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 32 లక్షల మంది డిపాజిటర్లను దాదాపు 6,380 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్ యాజమాన్యంపై అభియోగం. ఏపీ, తెలంగాణలో నమోదైన కేసుల ఆధారంగా మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ విచారణ జరుపుతోంది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లను గతంలో ఈడీ అరెస్టు చేసింది. తాజా అటాచ్‌మెంట్‌తో ఈడీ తాత్కాలిక జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 4,141 కోట్ల రూపాయలకు చేరింది. మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవీచూడండి: