తెలంగాణ

telangana

ETV Bharat / city

ECET RESULTS: నేడే ఈ-సెట్​ ఫలితాల విడుదల - తెలంగాణలో ఈ-సెట్​ ఫలితాలు

తెలంగాణలో ఈ-సెట్​ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Ecet Results relesing today in telangana
Ecet Results relesing today in telangana

By

Published : Aug 18, 2021, 4:23 AM IST

పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్​టీయూహెచ్​లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈనెల 3న జరిగిన ఈసెట్​కు సుమారు 24వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్, 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబరు 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

సెప్టెంబరు 13న ఈసెట్ తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 14న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు.

ఇదీ చూడండి:

ktr: 'జేఎన్​యూ గోడలపై రాసిన ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది'

ABOUT THE AUTHOR

...view details