EC appointed munugode by election observers: మునుగోడు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునితో పాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్‌ను ఈసీ నియమించింది. ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు మునుగోడులో పరిశీలకునిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
మునుగోడు ఉపఎన్నికకు పరిశీలకులను నియమించిన ఈసీ - మునుగోడు ఉపఎన్నిక పరిశీలకులను నియమించిన ఈసీ
EC appointed munugode by election observers: మునుగోడు ఉపఎన్నికలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునిని, పోలీసు పరిశీలకున్ని, వ్యయ పరిశీలకుడిని నియమించింది.
మునుగోడు కేంద్ర పరిశీలకులు
పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమించారు. పోలీసు పరిశీలకుడు కూడా ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ మూడో తేదీ వరకు మునుగోడు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తారు.
ఇవీ చదవండి: