తెలంగాణ

telangana

ETV Bharat / city

Bahubali Thali: బాహుబలి థాలీ తినండి.. రూ.లక్ష గెలవండి.! - బాహుబలి థాళి తిని లక్ష గెలుచుకోమంటున్న నాయుడుగారి హోటల్

Bahubali Thali: కళ్ల ముందే ఘుమఘుమలాడే కుండ బిర్యానీ..! మరింత రుచి కోసం.. నోరూరించే 30 రకాల వంటకాలు..! 30 నిమిషాల్లో వాటిని ఆరగించేస్తే.. అక్షరాల లక్ష రూపాయలు మీ సొంతం..! ఇదేదో బాగుంది కదూ..! పదండి.. ఆ రుచులు, ఆ లక్ష రూపాయల సంగతేంటో చూసేద్దాం.

కుండ బిర్యానీ తినండి.. రూ.లక్ష గెలవండి.!
కుండ బిర్యానీ తినండి.. రూ.లక్ష గెలవండి.!

By

Published : Feb 18, 2022, 8:02 PM IST

కుండ బిర్యానీ తినండి.. రూ.లక్ష గెలవండి.!

Bahubali Thali: ఇదిగో.. ఈ కంచం ఖాళీ చేస్తే లక్ష రూపాయలు సొంతం. రుచికి తోడు బహుమానం ఇస్తామంటోంది.. ఏపీలో విజయవాడలోని నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్. ఈ ఆఫర్‌లో భాగంగా.. బాహుబలి థాలీ పేరుతో కంచంలో బిర్యానీ సహా 30 ఇతర వంటకాలు వడ్డిస్తారు. వాటన్నింటినీ.. 30 నిమిషాల్లో శుభ్రంగా తినేస్తే.. అక్షరాల లక్ష రూపాయలు సొంతం చేసుకోవచ్చు.

పోటీల్లో రోజుకు 40మందికి పైగా..

విజయవాడలో ఆహార ప్రియులను ఆకర్షించేలా.. ఇతర ప్రాంతాల్లో బాగా ప్రచారంలో ఉన్న ట్రెండ్‌ను అనుసరిస్తోందీ రెస్టారెంట్. ఈ విషయాన్ని ఆన్‌లైన్‌లో చూసిన జనం.. క్యూ కట్టేస్తున్నారు. పోటీల్లో రోజుకు 40 మందికి పైగానే పాల్గొంటున్నారని.. రెస్టారెంట్ యజమాని వరనాయుడు తెలిపారు. కొన్నిరోజుల కిందట.. ఓ విజయవాడ యువకుడు బాహుబలి థాలీ బిర్యానీని 30 నిమిషాల్లో ఆరగించి.. లక్ష రూపాయలు గెలుచుకున్నాడని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details