Hyderabad Airport Expansion: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీని తట్టుకునేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. త్వరలో మరో టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా కొత్తగా ఈస్ట్రన్ టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. టాక్సీల రాకపోకలకు ప్రత్యేకంగా సొరంగ మార్గం నిర్మించారు. నాలుగు ర్యాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలు ఏర్పాటుచేశామని తెలిపిన జీఎంఆర్.. ట్యాక్సీల కోసం ప్రత్యేక మార్గం నిర్మించడం దేశంలోనే తొలిసారని వెల్లడించింది.
శంషాబాద్ విమానాశ్రయంలో టాక్సీల రాకపోకలకు సొరంగ మార్గం - hyderabad airport expansion
Hyderabad Airport Expansion: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా కొత్తగా ఈస్ట్రన్ టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా ట్యాక్సీల కోసం ప్రత్యేక మార్గం నిర్మించడం దేశంలోనే తొలిసారని జీఎంఆర్ సంస్థ వెల్లడించింది.
hyderabad international airport terminals
విమానాశ్రయం ఆవరణలో మూడు ఎయిరో బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. కొత్తగా 149 చెకింగ్, మరో 44 ఇమిగ్రేషన్ కౌంటర్లు, 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషిన్లు ఏర్పాటుచేశామని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.