EAMCET SCHEDULE RELEASE ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - మూడు విడతల్లో ఎంసెట్ కౌన్సెలింగ్
18:38 August 12
EAMCET SCHEDULE RELEASE మూడు విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ
ఎంసెట్ ఫలితాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈసారి మూడు విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలిపింది. మొదటి విడత కోసం ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది. ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువ పత్రాల పరిశీలన చేపడతామని 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని వివరించింది. సెప్టెంబరు 6న ఇంజినీరింగ్.. మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతామని ఉన్నత విద్యామండలి తెలిపింది. సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ చేపడతామని.. ఇందుకు సెప్టెంబరు 28, 29తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపింది. సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన చేసి.. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు తీసుకుంటామని వివరించింది. రెండోవిడత సీట్లను.. అక్టోబరు 4న కేటాయిస్తామని వివరించింది. అక్టోబరు 11 నుంచి.. తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని, అక్టోబరు 17న తుదివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తామని వివరించింది.
- ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
- ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
- ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు
- సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
- సెప్టెంబర్ 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్‌లు
- సెప్టెంబర్ 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
- సెప్టెంబర్ 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
- అక్టోబర్ 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
- అక్టోబర్ 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
- అక్టోబర్ 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
- అక్టోబర్ 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ
ఇవీ చదవండి:
Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం