EAMCET Results 2022: ఎంసెట్ ఫలితాలు ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంసెట్ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్... 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. లక్ష 56 వేల 812 మంది ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం.. 80 వేల 575 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం పరీక్షలు రాశారు.
EAMCET Results 2022: ఎల్లుండి ఎంసెట్ ఫలితాల విడుదల..!
EAMCET Results 2022: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాల విడుదలకు ముహుర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 12న లేదా 13న ఫలితాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఎంసెట్ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. ఆ తరువాత ఫలితాల ప్రకటనే..
EAMCET Results 2022 releasing tomorrow in Telangana
ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్ని బట్టి ఈ నెల 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవీ చూడండి: