తెలంగాణ

telangana

ETV Bharat / city

EAMCET EXAM : కొవిడ్ నిబంధనల్లో ఎంసెట్ పరీక్ష ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్(EAMCET EXAM) పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ స్పష్టం చేశారు. విద్యార్థులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్ష ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్ష ప్రారంభం

By

Published : Aug 4, 2021, 9:17 AM IST

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న ఎంసెట్ పరీక్ష(EAMCET EXAM) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ స్పష్ట చేయడంతో.. తల్లిదండ్రులు తమ పిల్లలను ముందే కేంద్రాలకు తీసుకువచ్చారు.

82 కేంద్రాల్లో..

ఆగస్టు 4,5,6 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి.. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సులకు ఎంసెట్(EAMCET EXAM) పరీక్షలు జరగనున్నాయి. రోజూ రెండు పూటలు పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రెండో పూట మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్​కు లక్ష 64 వేల 962 మంది.. ఫార్మా, వ్యవసాయ కోర్సుల కోసం 86 వేల 644 అభ్యర్థులు కలిపి రికార్డు స్థాయిలో 2 లక్షల 51 వేల 606 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ 82... ఏపీలో 23 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.

ప్రశాంతంగా..

హన్మకొండలో ఎంసెట్ పరీక్ష(EAMCET EXAM) ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలో-6, నర్సంపేట-2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 కేంద్రాల్లో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన 10వేల 800 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కరోనా నేపథ్యంలో.. విద్యార్థులంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేసినట్లు తెలిపారు.

  • ఇదీ చదవండి : Tokyo Olympics 2020: మహిళలు అదరగొడతారా?- గెలిస్తే చరిత్రే..

ABOUT THE AUTHOR

...view details