జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25న ఈ-ఎపిక్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించనుంది. ఈ-ఎపిక్ నూతన విధానంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని బల్దియా తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ల ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడమే గాక ఎపిక్ కార్డును స్టోర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ఓటరు గుర్తింపు కార్డు డౌన్లోడ్ - National Voters day 2021
ఓటరు గుర్తింపు కార్డును మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ వెల్లడించింది. రిజిస్టర్ చేసుకున్న నంబర్ల ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడంతో పాటు ఎపిక్ కార్డును స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది.
2021లో ప్రకటించిన స్పెషల్ సమ్మరీ రివిజన్లో కొత్తగా నమోదైన యువ ఓటర్లు ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ముందుగా తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ ల ద్వారా ఈ-ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులో ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఎపిక్ అనే పేరుతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఓటర్ పోర్టల్ ttp://voterportal.eci.gov.in, NVSP:https://nsvp.in, ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ https://play.google.com/store/apps/details?id=com.eci citizen ... ఐ.ఓ.ఎస్. ద్వారానైతే http://apps.apple.com/in/app/voter-helpline/id1456535004ల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ వెల్లడించింది.