తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రిపై మహిళల ఆగ్రహం.. సమావేశం ఎందుకు పెట్టారని నిలదీత

ఏపీ మంత్రి సురేశ్​పై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ప్రారంభానికి మంత్రి సురేశ్ సమయానికి హాజరుకాకపోవడంపై మండిపడ్డారు. సమయానికి రాలేనప్పుడు కార్యక్రమం పెట్టడం ఎందుకని నిలదీశారు.

women fire on minister
women fire on minister

By

Published : Apr 26, 2022, 10:48 PM IST

women fire on minister: ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ప్రారంభానికి మంత్రి సురేశ్ సమయానికి హాజరుకాకపోవడంపై.. మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మార్కాపురం వచ్చిన సురేష్‌కు.. స్థానిక నేతలు బైక్‌ ర్యాలీతో స్వాగతం పలికారు. అదే సమయంలో డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ పథకం ప్రారంభ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని చెప్పిన అధికారులు.. 9 గంటల కల్లా డ్వాక్రా మహిళలందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు.

దీంతో మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా మంత్రి రాలేదని.. ఉదయం నుంచి ఎదురుచూస్తున్నామంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాలేనప్పుడు కార్యక్రమం పెట్టడం ఎందుకని నిలదీశారు. తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు బయటకి రాగా.. సమావేశం నుంచి వెళ్లకూడదంటూ డ్వాక్రా ఆర్పీ అడ్డుకున్నారని.. వెళితే డబ్బులు రాకుండా చేస్తామని, ప్రభుత్వ పథకాలన్నీ ఆపుతామని బెదిరించారని మహిళలు వాపోయారు.

మంత్రిపై మహిళల ఆగ్రహం..

ABOUT THE AUTHOR

...view details