తెలంగాణ

telangana

ETV Bharat / city

ద్వారకా తిరుమల శ్రీవారికి ఘనంగా చక్రస్నానం - dwaraka tirumala chakra snanam news today

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అధిక ఆశ్వయుజ మాస కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ చక్ర - అవభృధోత్సవం, రాత్రి పూర్ణాహుతి ధ్వజావరోహణాన్ని ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ద్వారకా తిరుమల శ్రీవారికి ఘనంగా చక్రస్నానం
ద్వారకా తిరుమల శ్రీవారికి ఘనంగా చక్రస్నానం

By

Published : Oct 3, 2020, 9:03 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్వయుజ మాసం తిరుకళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చక్ర - అవభృధోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని, శ్రీ చక్ర పెరుమాళ్లను సింహాసనంపై కొలువు ఉంచారు.

చందనోదకం, సుగంధ ద్రవ్యాలతో

అనంతరం ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందనోదకం, సుగంధ ద్రవ్యాల అభిషేక జలాలతో శ్రీ చక్ర పెరుమాళును అభిషేకించారు. శ్రీ చక్ర పెరుమాళ్లుతో పాటు స్వామి అమ్మవార్లను అలంకరించి హారతులు ఇచ్చి అభిషేక జలాలను భక్తుల శిరస్సులపై చల్లారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి పూర్ణాహుతి ధ్వజావరోహణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఇదీ చూడండి: ఈ గ్రేటర్‌ ఎన్నికల్లోనూ 2016 నాటి కేటాయింపులే అమలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details