తెలంగాణ

telangana

ETV Bharat / city

Drunkard employee: ఆస్పత్రిలో అర్జున్ రెడ్డి... పూటుగా తాగొచ్చి విధులు - ap latest news

అర్జున్​రెడ్డి సినిమాలో హీరో పూటుగా తాగొచ్చి రోగులకు హీరో వైద్యం చేస్తుంటాడు. అచ్చం అదే సీన్​ ఆ ఆస్పత్రిలోనూ రిపీటయ్యింది. అక్కడ హీరో ఆపరేషన్లు చేస్తే.. ఇక్కడ మాత్రం మందులతోనే సరిపెట్టాడనుకోండి. అయినా.. అసవు విషయం కనిపెట్టి రోగుల బంధువులు లొల్లి షురూ చేశారు.

duties-of-an-alcoholic-employee-at-the-anantapur-general-hospital
duties-of-an-alcoholic-employee-at-the-anantapur-general-hospital

By

Published : Sep 12, 2021, 7:23 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో మద్యం తాగొచ్చి ఓ ఉద్యోగి హల్​చల్​ చేశాడు. ఫార్మసీ విభాగంలో పని చేస్తున్న రాజు.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు ఇస్తుంటాడు. ఈ రోజు ఉదయం పూటుగా తాగొచ్చి అందరికీ ఒకే రకం మందులు ఇచ్చాడు. మద్యం మత్తులోనే రాజు ఇలా చేస్తున్నాడని గుర్తించిన రోగుల బంధువులు ఇదేంటని ప్రశ్నించారు. ఆస్పత్రికి తాగి ఎలా వస్తావంటూ నిలదీశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజు.. రోగులపై ఇష్టానుసారంగా మాట్లాడాడు.

రోగులు ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్​కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జగన్నాథ్.. ఉద్యోగి రాజును విధుల నుంచి తొలగించారు.

ఆస్పత్రిలో అర్జున్ రెడ్డి... పూటుగా తాగొచ్చి విధులు

ABOUT THE AUTHOR

...view details