విజయదశమిని పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాకారంలో ధర్మాచరణ సమితి ఆధ్వర్యంలో బొడ్రాయి పండుగ, జెండా ఆవిష్కరణ, రావణ దహనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బాకారం లోని పోచమ్మ ఆలయానికి గుమ్మడి కాయని తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బొడ్రాయి వద్ద గుమ్మడికాయ కొట్టి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రావణ దహనం జరిగింది. ఆ తర్వాత ప్రజలు పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకొని ఆలింగనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా రావణ దహన కార్యక్రమం బొడ్రాయి పండుగ తదితర పూజలు నిర్వహించామని ధర్మాచరణ సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
ముషీరాబాద్‌లో ఘనంగా దసరా వేడుకలు - దసరా
ముషీరాబాద్ నియోజకవర్గంలో దసరా వేడుకలను ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.

ముషీరాబాద్‌లో ఘనంగా దసరా వేడుకలు
Last Updated : Oct 9, 2019, 6:37 AM IST