జంట నగరాల పరిధిలో దాదాపు 5 వేలకుపైగా కుటుంబాలు విగ్రహాల తయారీ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. వీరికితోడు సీజన్‌కి 7 నెలల ముందు జనవరిలో కోల్‌కతా, ముంబయి, యూపీ నుంచి వేల మంది కళాకారులు వస్తుంటారు. వినాయక ఉత్సవాల కోసం కనీసం లక్షకుపైగా గణేశ్ ప్రతిమలు, దసరాకు ముందు 60 వేల దాకా దుర్గామాత ప్రతిమలు తయారు చేస్తుంటారు. అయితే గత ఏడాదిన్నరగా రెండు సీజన్లూ ఈ కుటుంబాలకు కలిసి రాకపోగా విగ్రహాలన్నీ షెడ్లకే పరిమితమై పాడైపోయాయి. ఈ ఏడాది 70 వేల భారీ గణేశ్ విగ్రహాలు అమ్ముడుకాగా 50 వేల దాకా దుర్గామాత ప్రతిమలు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివెళ్లాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెట్టిన ఖర్చుతోపాటు నష్టం నుంచీ తేరుకునే అవకాశం దక్కిందని సంబరపడుతున్నారు
మార్కెట్లకు పండగ కళ!
వారాంతాలు, పండగల సమయంలో నగరంలోని కోఠి, సుల్తాన్‌బజార్, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. కొవిడ్ దెబ్బకి కొంతకాలంగా బోసిపోయిన ఈ ప్రాంతాలకు దసరా పండగ కళతెచ్చింది. అమీర్‌పేట, పీఅండ్‌టీ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్ పరిసరాల్లో అయితే 24 గంటలూ దారులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. షాపింగ్ మాళ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కుటుంబసమేతంగా సినిమా హాళ్లదీ అదే కథ.
‘ఆహా’రం భళా