Dussehra festival celebrations in telangana: రాష్ట్రవ్యాప్తంగా దసరా సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు వేడుకలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలక్ష్మణ ఆయుధాలకు పూజలు చేసి రావణాసురుని దహన కార్యక్రమం నిర్వహించారు.
సిద్దిపేటలోని దసరా ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. కరీనంగర్ జిల్లా చొప్పదండిలో వాహన పూజలు చేశారు. అనంతరం నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత శోభయాత్ర చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మిని స్టేడియంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.