లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో మూగజీవాలకు ఆహారం లేకుండా పోయింది. వీధి శునకాల ఆకలి రోదనా వర్ణనాతీతం. వీటి పరిస్థితిని చూసి నగరానికి చెందిన దుర్గారావు అనే స్వచ్ఛంద సేవకుడు చలించిపోయారు.
Animal Lover : లాక్డౌన్లో శునకాల ఆకలి తీరుస్తున్న దుర్గారావు - durga rao feeds street animals during lockdown
లాక్‌డౌన్ వల్ల మనుషులే కాదు.. మూగజీవాలూ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉపాధి కోల్పోయి ఒక్క పూట తిండికోసం పేదలు ఎదురుచూస్తుంటే.. ఆకలితో మూగజీవాలు మౌనంగా రోదిస్తున్నాయి. వాటి పరిస్థితిని చూసి చలించిన ఓ జంతు ప్రేమికుడు తన సొంత ఖర్చులతో శునకాల ఆకలి తీరుస్తున్నాడు.
జంతు ప్రేమికుడు, జంతు సేవకుడు, దుర్గారావు
స్వయంగా పెరుగన్నం తయారు చేసుకుని.. రోజూ 50 కిలోమీటర్లు ప్రయాణిస్తూ... వీధి శునకాల ఆకలి తీరుస్తున్నారు. ఎక్కడ శునకాలు కనిపించినా వాటికి ఆహారం అందిస్తున్నారు. లీడ్ వరల్డ్-2050 అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా దుర్గారావు.. మూగజీవాలకు సేవ చేస్తున్నారు. తన సొంత ఖర్చులతోనే శునకాలకు ఆహారం పెడుతున్నట్లు చెప్పారు.