పశ్చిమ మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 1.5 కిమీ. ఎత్తు వరకు కొనసాగుతోందని వివరించింది.
అల్పపీడనం: రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - telangana weather update
పశ్చిమ మధ్యప్రదేశ్ దానిని ఆనుకోని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అల్పపీడనం: రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవీచూడండి:జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే!