Ministers on Governor Speech : భాజపా నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మహిళా గవర్నర్‌ను అవమానించామన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం లేదన్న మంత్రులు... గతంలోనూ గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే 2004లో పార్లమెంట్ సమావేశాలు జరిగాయని వివరించారు. శాసన సభ ప్రొరోగ్ కానందునే గవర్నర్ ప్రసంగం ఉండదన్న మంత్రులు....గతంలో అధికార పక్ష సభ్యల కంటే విపక్షాలకే ఎక్కువ సమయం కేటాయించినట్లు శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
బండి సంజయ్‌కి నైతిక అర్హత
'బండి సంజయ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. మహిళా గవర్నర్‌ను అవమానించామన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అసోం సీఎం హేమంత్ మాతృమూర్తులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. హేమంత్ బిశ్వాస్ వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు. బండి సంజయ్‌కు మహిళలపై మాట్లాడే నైతిక అర్హత లేదు. గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం మాకు లేదు.' - హరీశ్‌రావు
గవర్నర్‌ను పిలిస్తే తప్పు