తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస మోసాలు అరికట్టేందుకు భాజపాను గెలిపించాలి: రఘునందన్​ రావు - తార్నాకలో రఘునందన్​ రావు ప్రచారం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా... తార్నాక డివిజన్​లో భాజపా అభ్యర్థి తరఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు ప్రచారం నిర్వహించారు. గ్రేటర్​ భాజపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

dubbaka mla raghunandan rao ghmc elections campaigning in tharnaka
తెరాస మోసాలు అరికట్టేందుకు భాజపాను గెలిపించాలి: రఘునందన్​ రావు

By

Published : Nov 28, 2020, 7:23 PM IST

దుబ్బాకలో వచ్చిన ఫలితమే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ రావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. తార్నాక డివిజన్ భాజపా అభ్యర్థి బండా జయసుధ తరఫున... మాజీ మేయర్​ బండా కార్తీక రెడ్డితో కలిసి లాలాపేట్​లో రోడ్​ షో నిర్వహించారు. కేంద్రం నిధులు రాష్ట్రంలో ఖర్చు చేస్తూ... తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెరాస మోసాలను అరికట్టాలంటే గ్రేటర్​లో భాజపాను గెలిపించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details