తెలంగాణ

telangana

ETV Bharat / city

మోదీపై విమర్శలను ఖండించిన రఘునందన్.. రేవంత్​రెడ్డికి సవాల్​..

Raghunandan Rao Comments: ప్రధాని మోదీపై మంత్రి హరీశ్​రావు, రేవంత్​రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ఖండించారు. వచ్చే శనివారం ఉదయం 11 గంటలకు రేవంత్‌ రెడ్డితో అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్దమని రఘునందన్ రావు సవాల్ విసిరారు.

dubbaka mla raghunandan rao fire on harish rao and revanth reddy
dubbaka mla raghunandan rao fire on harish rao and revanth reddy

By

Published : Feb 8, 2022, 7:22 PM IST

Raghunandan Rao Comments: రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను ఖండించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మణిశంకర్ అయ్యర్, అహ్మద్‌ పటేల్‌ ఎక్కడున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు.

హరీశ్​రావుకు అగ్గిపెట్టే దొరికి ఉంటే..

వచ్చే శనివారం ఉదయం 11 గంటలకు రేవంత్‌ రెడ్డితో అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్దమని రఘునందన్ రావు సవాల్ విసిరారు. రేవంత్‌ రెడ్డిని తయారు చేసిన చంద్రబాబే... 1997లో తెలంగాణను అడ్డుకున్నట్టు ఆనాడు అడ్వాణి చెప్పారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో హరీశ్​రావుకు అగ్గిపెట్టె దొరికి ఉంటే 1200 మంది యువకుల ఆత్మబలిదానాలు జరిగేవి కాదని రఘునందన్​ అన్నారు. గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేటకు ఇచ్చిన నిధులు దుబ్బాకకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. మంత్రి హరీశ్​రావు శిలాఫలకాలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేల పేర్లు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో భాజపా అధికారంలోకి..

"లోక్​సభ, రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, తెరాస నేతలకు ఏం అర్ధమయ్యాయో తెలియటం లేదు. గతంలో వాజ్​పేయ్ హయాంలో ఘర్షణ లేకుండా దేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎలాంటి చర్చలేకుండా ఏపీని విభజించిందని మాత్రమే మోదీ అన్నారు. సహచర ఎంపీలను రేవంత్ రెడ్డి ఇష్టమున్నట్టు సంభోదించటం సిగ్గుచేటు. భారత రాజ్యాంగం మీద రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు. 1200 మంది చనిపోడానికి కారణమైన తెరాస.. నరేంద్రమోదీని విమర్శిస్తోంది. దుబ్బాక, హుజురాబాద్​లో సిలిండర్లు మోసినా.. ప్రజలు తిప్పికొట్టింది హరీశ్​రావు మర్చిపోయినట్టున్నాడు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, దుబ్బాకకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పడం లేదు. 53 కోట్లు ఉపాధిహామీ పథకం నిధులు కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాకు ఇచ్చారు. త్వరలోనే తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకువస్తాం." - రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details