వదుబ్బాకలో ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గవ్యాప్తంగా పోలైన మొత్తం లక్షా 64వేల192 ఓట్లను అధికారులు లెక్కించారు. మొదటి రౌండ్‌లో 7వేల 446 ఓట్లు లెక్కించగా... 341 ఓట్లతో రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు. భాజపా అభ్యర్థికి 3వేల 208 ఓట్లు, తెరాస అభ్యర్థి సుజాతకు 2వేల 867, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 648 పోల్ అయ్యాయి. రెండో రౌండ్‌లోనూ భాజపాదే పైచేయిగా నిలిచింది. ఈ రౌండ్‌లో 7వేల 127 ఓట్లకు గానూ... భాజపా అభ్యర్థికి 3వేల 284 ఓట్లు, సుజాతకు 2వేల 490, శ్రీనివాస్ రెడ్డికి 667 ఓట్లు వచ్చాయి.
మూడో రౌండ్‌లో 6వేల 601 ఓట్లు లెక్కించగా... రఘునందన్ రావుకు 2వేల 731 ఓట్లు, సుజాతకు 2వేల 607, శ్రీనివాస్ రెడ్డికి 616 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్‌లో 6వేల 900 ఓట్లు లెక్కించగా... 3వేల 832 ఓట్లు సాధించి 14వందల 25 ఓట్లతో రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు. సుజాత 2వేల 407, కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి 227 ఓట్లు సాధించారు. వరసగా 5 రౌండ్లలోనూ భాజపా ఆధిక్యం కనబర్చింది. ఐదో రౌండ్‌లో రఘునందన్ రావు 3వేల 462 ఓట్లు రాగా... 336 ఓట్లు ఆధిక్యం వచ్చాయి. ఈ రౌండ్‌లో 7వేల 922 ఓట్లు లెక్కించగా... భాజపా అభ్యర్థికి 3వేల 462 ఓట్లు రాగా... తెరాస అభ్యర్థి 3వేల 126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 566 ఓట్లు వచ్చాయి.
తెరాస ఆధిక్యం
అనంతరం వెలువడిన 6,7 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం లభించింది. ఆరో రౌండ్‌లో 9వేల 179 ఓట్లు లెక్కించగా... తెరాసకు 4వేల 62, భాజపాకు 3వేల709, కాంగ్రెస్‌కు 530 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యం రాగా... మొత్తం 6 రౌండ్లు ముగిసేసరికి భాజపా 2 వేల 667 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. ఏడో రౌండ్‌లో 6వేల 880 ఓట్లు లెక్కించగా... తెరాసకు 2 వేల 718 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో 2 వేల 536 ఓట్లతో భాజపా అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా... 749 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
8,9 రౌండ్లలో భాజపా పుంజుకుంది. ఎనిమిదో రౌండ్‌లో మొత్తం 7వేల 6వందల ఓట్లు లెక్కించారు. ఇందులో భాజపా అభ్యర్థికి 3 వేల 116 ఓట్లు రాగా... 621 ఆధిక్యత సాధించారు. తెరాస అభ్యర్థి 2 వేల 495 ఓట్లతో రెండో స్థానంలో... కాంగ్రెస్ అభ్యర్థి11వందల 22 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తొమ్మిదో రౌండ్లలోనూ కమలం అభ్యర్థిదే పైచేయిగా నిలిచింది. ఇందులో భాజపా 3 వేల 413 ఓట్లు సాధించి వెయ్యి 84 ఓట్ల ఆధిక్యత కనబర్చారు. తెరాసకు 2వేల 329 ఓట్లు, కాంగ్రెస్‌కు 675 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ ఆధిక్యం
పదో రౌండ్‌లో ఆధిక్యత కనబర్చిన తెరాస... 11వ రౌండ్‌లో వెనకబడ్డారు. 10వ రౌండ్‌లో 7 వేల 233 ఓట్లకు గానూ... తెరాసకు 2వేల 948 ఓట్లు రాగా... 456 ఆధిక్యత సాధించారు. భాజపా అభ్యర్థికి 2 వేల 492, కాంగ్రెస్ అభ్యర్థికి 899 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో 8వేల 463 ఓట్లు ఉండగా.... భాజపా అభ్యర్థికి 2వేల 965 ఓట్లు సాధించి... కమలం పార్టీ 199 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. తెరాస అభ్యర్థికి ఈ రౌండ్‌లో 2 వేల 766 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి వెయ్యి 883 ఓట్లు పోలయ్యాయి. 12వ రౌండ్‌లో 2 వేల 80 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి... 83 ఓట్లతో ఆధిక్యత కనబర్చారు. ఈ రౌండ్‌లో 19 వందల 97 ఓట్లతో రఘునందన్ రావు రెండో స్థానంలో నిలవగా... 19 వందల ఓట్లతో తెరాస మూడోస్థానంలో నిలిచింది.
13వ రౌండ్ నుంచి తెరాస ఆధిక్యత
13వ రౌండ్ నుంచి వరసగా తెరాస ఆధిక్యత సాధించింది. 13వ రౌండ్‌లో తెరాస అభ్యర్థి 2 వేల 824 ఓట్లు రాగా... 304 ఓట్లతో ఆధిక్యత కనబర్చారు. భాజపా అభ్యర్థికి 2 వేల 520, కాంగ్రెస్‌కు 12 వందల 12 ఓట్లు పోలయ్యాయి. 14వ రౌండ్‌లో తెరాసకు 2 వేల 537 ఓట్లు లభించాయి. ఈ రౌండ్‌లో ఆ పార్టీ 288 ఆధిక్యం కనబర్చింది. భాజపా అభ్యర్థికి 2 వేల 249 ఓట్లు, కాంగ్రెస్‌కు 784 ఓట్లు వచ్చాయి. 15 వ రౌండ్‌లో తెరాసకు 3 వేల 27 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో ఆ పార్టీ 955 ఆధిక్యం కనబరిచింది. భాజపా అభ్యర్థికి 2 వేల 72 ఓట్లు... కాంగ్రెస్‌కు 15వందల ఓట్లు వచ్చాయి.
16వ రౌండ్‌లో తెరాసకు 749 ఓట్ల ఆధిక్యం లభించింది. 3 వేల 157 ఓట్లు రాగా... భాజపాకు 2 వేల 408 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 674 ఓట్లు పోలయ్యాయి. 17వ రౌండ్‌లో తెరాస 872 ఓట్ల ఆధిక్యత కనబర్చింది. అధికార పార్టీకి 2వేల 818 ఓట్లు రాగా... భాజపాకు 19వందల 46 ఓట్లు, కాంగ్రెస్‌కు 17వందల 5 ఓట్లు పోలయ్యాయి. 18వ రౌండ్‌లో తెరాస 688 ఓట్ల ఆధిక్యత కనబర్చింది. ఈ రౌండ్‌లో గులాబీ పార్టీ 3 వేల 215 ఓట్లు సాధించగా... భాజపాకు 2వేల 527 ఓట్లు, కాంగ్రెస్‌కు 852 ఓట్లు వచ్చాయి. 19వ రౌండ్‌లో తెరాసకు 2వేల 760 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో 425 ఓట్లతో ఆ పార్టీ ఆధిక్యతను కనబర్చింది. భాజపాకు 2 వేల 335 ఓట్లు, కాంగ్రెస్‌కు 976 ఓట్లు పోలయ్యాయి.
భాజపాకే పట్టం..
20వ రౌండ్‌లో మళ్లీ భాజపా ఆధిక్యంలోకి వచ్చింది. ఈ రౌండ్‌లో 2వేల 931 ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి... 491 ఓట్లతో మళ్లీ ముందుకొచ్చారు. తెరాస అభ్యర్థి 2 వేల 440, కాంగ్రెస్ అభ్యర్థి వెయ్యి 58 ఓట్లు సాధించారు. 21వ రౌండ్‌లో 380 ఓట్లతో భాజపా ఆధిక్యత కనబర్చింది. ఈ రౌండ్‌లో భాజపాకు 2వేల 428 ఓట్లు రాగా... తెరాసకు 2వేల 48 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 845 ఓట్లు పోలయ్యాయి. 22వ రౌండ్‌లో కమలం పార్టీ 438 ఆధిక్యం కనబర్చింది. ఈ రౌండ్‌లో భాజపాకు 2వేల 958 ఓట్లు రాగా... తెరాసకు 2వేల 520 ఓట్లు, కాంగ్రెస్‌కు 971 ఓట్లు పోలయ్యాయి. 23వ రౌండ్‌లో 3 వేల 895 ఓట్లకు గానూ... 1653 ఓట్లతో భాజపా అధిక్యత కనబరిచింది. తెరాస 1241, కాంగ్రెస్ 580 ఓట్లు పొందాయి. ఉత్కంఠగా సాగిన ఉపపోరులో 62,772 ఓట్లు సాధించి 1,079 ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 61,302ఓట్లతో తెరాస అభ్యర్థి సుజాత రెండో స్థానం, 21,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
ఇదీ చూడండి:దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయం