దుబ్బాక ఉపఎన్నికపై భాజపా సమావేశం.. కిషన్‌రెడ్డి హాజరు - dubbaka bypoll news
15:53 October 03
దుబ్బాక ఉపఎన్నికపై భాజపా సమావేశం.. కిషన్‌రెడ్డి హాజరు
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో దుబ్బాక ఉపఎన్నికపై సన్నాహక సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, దుబ్బాక ఉపఎన్నిక భాజపా ఇంఛార్జి జితేందర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, విజయ రామారావు, చాడ సురేష్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపిక, దుబ్బాకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాలు, బలహీనతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, ప్రచారానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు.
ఇవీచూడండి:ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి