'ఈఎస్ఐ కుంభకోణంలో ఎవర్నీ వదలం' - acb rides at esi managers house
ఈఎస్ఐ కుంభకోణంలో ఎంతటి వారున్నా... వదిలేది లేదని ఏసీబీ డీఎస్బీ ఆనంద్‌కుమార్ అన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
'ఈఎస్ఐ కుంభకోణంలో ఎవర్నీ వదలం'
ఈఎస్ఐ ఔషధ కొనుగోళ్ల కుంభకోణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ అన్నారు. ఈ స్కామ్‌లో ఎంతటి వారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రగతినగర్‌లో నివాసముంటున్న కొడాలి నాగలక్ష్మి ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమైనట్లుతెలిపారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
- ఇదీ చూడండి : ఈఎస్ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు