తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒప్పంద ఉపాధ్యాయులుగా డీఎస్సీ-2008 అభ్యర్థులు - govt decession on dsc 2008

డీఎస్సీ-2008 అభ్యర్థులను ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల్లో చేరేందుకు అంగీకారం తెలిపిన అభ్యర్థుల జాబితాను ఈనెల 18లోపు పంపించాలని సూచించింది.

dsc-2008
డీఎస్సీ-2008

By

Published : May 16, 2020, 9:31 AM IST

డీఎస్సీ-2008లో ఎంపిక ప్రక్రియ మార్పు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 4,657 మందిని ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ)గా నియమిస్తారు. కనీస టైం స్కేల్‌ రూ.21,230 జీతంతో పదవీ విరమణ వరకు పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఆదేశించింది.

ఉద్యోగాల్లో చేరేందుకు అంగీకారం తెలిపిన అభ్యర్థుల జాబితాను ఈనెల 18లోపు పంపించాలని సూచించింది. వీరు ఎస్జీటీలుగా చేరిన రెండేళ్లలోపు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం ఆరు నెలల ప్రాథమిక విద్య బ్రిడ్జి కోర్సును పూర్తిచేయాలి.

ABOUT THE AUTHOR

...view details